Monday, May 14, 2007

తెలుగుకొచ్చిన తిప్పలు

మా అమ్మా-నాన్నలు చదువుకునే రోజుల్లొ ఇంగ్లీషు చదువులు తక్కువ. ఇంగ్లీషు వాడుక వాళ్ళు ఉద్యోగాలు చేయటం మొదలయ్యిన తరువాత క్రమంగా పెరిగిపోయింది. అప్పట్లో తెలుగులో ఇంగ్లీషు దొర్లేది. పోయినేడు ఇండియకెళ్ళినప్పుడు బయట యువత "తెలుగులో" మాట్లాడుకుంటుంటే, ఇప్పుడు ఇంగ్లీషులో తెలుగు దొర్లుతోందా అని అనుమానం వస్తోంది. పిల్లల దాకా ఎందుకు, అప్పుడప్పుడు కలిసే మా తెలుగు మితృలతో నా సంభాషణలు ఇలా ఉంటాయి-

నేను: బావున్నారా?
టెల్గూస్: Doing good..doing good! How are you doing?
నేను: మేమూ బానే ఉన్నాం. చాలా రోజులయ్యింది కనిపించి?
టెల్గూస్: Yeah... been quite busy at work, lately. How is your work?
నేను: ఫర్వాలేదు, highs and lows. పిల్లలు బావున్నారా?
టెల్గూస్: They have a crazy life too.

రామ చంద్రా...ఏమిటీ దుర్గతి! ఎప్పుడైనా చైనీసు వాళ్ళని గమనించారో లేదో, కలిస్తే చాలు, చింగ్-చుంగ్-చాంగ్ మంటూ మాట్లాడేసుకుంటారు. మనకే ఎందుకీ దుస్థితి?

ఇంకో క్లాసిక్, తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ ఇంటికి ఫోను చేసి వాయిస్ మైల్ కి వెళ్తే, పెట్టే మెసేజీలు -
Hi! This is Pulla Rao calling from Boston. Been a long time since we spoke. Will try calling again later. By the way, Wish you a Happy Telugu new year, I mean, Happy Ugadi!

అదే మన జ్యోతి కనుక చేస్తే ఇలా ఉంటుంది -
ఏమే ఎంకమ్మా! మళ్ళీ ఏమైపోయావ్? ఎప్పుడూ ఫోను తియ్యవేమే? ... వగైరా, వగైరా, వగైరా

అదే శ్రీహరి చేస్తే, పలుకే బంగారమాయెరా స్టయిలు - అక్కా, ఓసారి ఫోన్ చెయ్యి. ఉంటాను!

ఇక పూర్తిగా ఆడవాళ్ళ డిపార్ట్మెంటు కొస్తే, ఇలా ఉంటున్నాయి సంభాషణలు -
పార్టీ మెన్యూ తేల్చారాండి?
ఆ...veggie pakodas, పకోడీలు?
okra chutney, బెండకాయ పచ్చడి?
broad beans fry, చిక్కుడుకాయ వేపుడు?
potato kurma, ఆలుగడ్డ/బంగాళాదుంప కుర్మా
spinach pappu, హతోస్మి! పాలకూర పప్పు
chicken rice, పలావు/బిరియానీ కి ఫ్యాన్సీ పేరు "రైస్" అయ్యిందా?
సాంబారు,
curd rice పెరుగన్నమేగా?

అందుకే కాబోలు, మా ఇంటికి వచ్చిన ఓ అబ్బాయిని, "పాల కూర పప్పేయనా?" అని అరడజను సార్లు అడిగినా అర్థం కాలేదు పాపం.

2 comments:

Anonymous said...

తెలుగు వాళ్ళ identity ని కోల్పోతాము కదండీ తెలుగులో మాట్లాడుకుంటుంటే. నా identity ని అప్రయత్నంగా నిలుపుకునే తెలుగు వాళ్ళలో నేనూ ఒక దాన్ని. మా పిల్లలకు తెలుగు అర్థం అవుతుంది. మట్లాడడం అలవాటు అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయో తెలియదు కానీ వాళ్ళు చెప్పిన తెలుగు rhymes కొన్ని ఇక్కడ చూడండి.

http://www.telugu4kids.com/rhymes.aspx

దొప్పలపూడి said...

బావుందండీ, మీ వెబ్ సైట్.