Thursday, May 17, 2007

ఇక్కడి పిల్లలు - తెలుగు

మన పిల్లలు ఎక్కువ మంది, ఇంట్లో గడిపే టైం కన్నా బయట గడిపేది ఎక్కువైపోవటం వల్ల, తెలుగు కన్నా ఇంగ్లీషు మాట్లాడటం ఎక్కువ కదా. కానీ పర్లేదు, మనం టైము, వీలూ చేసుకుంటే, కనీసం చిన్న-చిన్న సంభాషణల వరకైనా నేర్పించుకోవచ్చు. ఈ మధ్య మా ఇంట్లో పిల్లలిద్దరూ ఎంతో కొంత తెలుగులో ప్రయత్నిస్తున్నారు. ఇవిగో నమూనాలు -

అమ్మా, more నెయ్యి కావాలి.
నాన్నెక్కడున్నాడు?
నాన్న is స్నానమింగ్.
చెల్లి పిల్ల ఈజ్ కోతి పిల్ల. She does all కోతి వేషాలు.
ఆ ఆంటీ కి spoon కావాలి.
ముద్ద పప్పు - ఆవకాయి కావాలి.
కారం, మంట. మంచి నీళ్ళు కావాలి!!!!

ఇదుగో, నవ్వుకో దగ్గ సాంపిల్ - ఈ మధ్యో సారి తెలిసిన వాళ్ళబ్బాయి (విష్ణు తోటి వాడు) కలిసినప్పుడు, మొహం పీక్కు పోయినట్టుంటే, "ఏం కృష్ణా, ఒంట్లో బాలేదా?" అని అడిగా. "ఏం లేదాంటీ, ఇప్పుడే డోక్కునొచ్చా". నేను నవ్వాపుకోవటం కష్టమైపోయింది. సంగతేంటంటే, ఊళ్ళో stomach fluలున్నాయి. తనకూడా మొదలైనట్టుంది, పాపం.

1 comment:

spandana said...

మా అమ్మాయి ఇప్పుడిప్పుడే స్కూలుకెళుతుండడం వల్ల ఇంగ్లీషులో తెలుగు ఇలా దొర్లుతోంది.

నాన్నా my కాల్ (కాలు) is జారింగ్. (జారుతోంది).

ఇంకా మర్చిపోయా, మీలా గ్రందస్థం చేస్తే భవిష్యత్తులో కూడా నవ్వుకోవచ్చు అనిపిస్తోంది.

--ప్రసాద్
http://blog.charasala.com